శంబలనగరికి ఒట్టి చేతులతో వచ్చి , దైవ శక్తి చైతన్యా న్ని స్వీ కరించి అనుభూతి పొందవచ్చు. శంబలనగరిగాయత్రిమాత మందిరంలో కొలువైఉన్న గాయత్రీ మాత శాంతి స్వరూపం. కరుణించే చూపు, చిరుమందహాసంతో, కమలం మధ్యలో హంసవాహనురాలై, తూర్పుకు అభిముఖంగా ఆశీనులై ఉన్నారు. సుమారు 1800 కిలోల బరువు గల 9 అడుగుల ఎత్తు ఉన్న పంచలోహ విగ్రహం. గాయత్రి మందిరం పై సూర్యోదయపు లేలేత కిరణాలు, ఆ మందిరంపైఉన్న కలశం పైనుంచి, నెమ్మది, నెమ్మదిగా మాత విగ్రహాన్ని తాకినప్పటి దృశ్యం సంబ్రమాశ్చర్యాలతో పాటు ఎటువంటి ఆలోచనలు లేకుండా చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రత్యక్ష దైవాలు ఏ విధం గా కలశం పైనుంచి మందిరం లో కొలువైఉన్న గాయత్రి మాత విగ్రహం లోకిసృష్ఠి చైతన్య ప్రవేశం జరుగుతుందో అదేవిధంగా. ఋషితండ్రితపశ్శక్తిని మందిరం పై గల కలశం నుండిగాయత్రీ మాత విగ్రహం లోకితద్వారా అక్కడ నేల లోకినిరంతరం చైతన్యం ప్రవహిస్తూనేఉండటం వలన దర్శనానికివచ్చి న వారందరూ వారికి తెలియ కుండానే మౌనంగా చైతన్యా న్ని స్వీ కరించగలుగుతున్నారు.
Read Moreధ్యానం నాన్న జీవితం అందరి మాదిరిగానే మొదలైనా అనుభవం సమాజంలో ఒకే ఒక్కరిని చేసింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కొత్త ద్వారాలు తెరుచుకుంటూ వచ్చి నిత్య గాయిత్రి తపస్విగా మార్చింది. చిన్నపుడు అమ్మమ్మ ప్రేరణతో భయం(నియంత్రణ), భక్తి (ఏకాగ్రత). 7 సంవత్సరాల వయసులో అంటే 1969 లో యోగా మొదలైంది. ఆ యోగాతోనే 1971 లోనే రెండు శ్వాసలు సమానమైన అనుభవం వచ్చింది. 1983 లో గాయిత్రి పై అనుభవ అవగాహన అయింది. అపుడు రోజుకు కొన్ని గంటలే గాయిత్రి (రెండు శ్వాసలు సమానం కావడం). 2004 లో నిత్యం జరిగింది. 2006 నాటికి జీవితం అయింది. ఆ సంత్సరమే 6 నెలల 6 రోజులు తేనెతో ఉన్నారు. ఆ సమయంలోనే చింతన, త్యాగం మొదలైంది. 1983 నుంచి ఉచిత యోగా క్లాసులు. ఉదయం 3 గంటలకే నిద్రలేచి 84 రకాల ఆసనాలు, 24 రకాల క్రియలు చేసేవారు. తరువాత యోగ క్లాసుల నిర్వహణ. ఏకాంతం, యోగా, ధ్యాన అనుభవమే సహజ నిత్య గాయిత్రికి బీజం వేసింది. హిమాలయాల్లో చేసిన తపస్సు తోడైంది . ఋషి తండ్రి 48 సార్లు హిమాలయాలకు వెళ్ళారు. ఒక్కోసారి 24 రోజుల నుంచి 48 రోజుల వరకూ ఉన్నారు. డీప్ హిమాలయ గుహల్లోను ఉండి కఠోర తపస్సు చేశారు. హిమాలయాలకు వెళ్ళి వస్తూనే క్రియ యోగ క్లాసులు చెబుతూ ఉండేవారు. క్రియ యోగ ధ్యానం మాస్టర్ గా అందరికీ సుపరిచితమే. లక్షా 80 వేల ధ్యానం ఆధ్యాత్మిక పిల్లలు అలా అనుసంధానమయ్యారు. సాధన అనుభవమే తపస్విని చేసింది. 2014 మార్చి 9వ తేదీ న ఆశ్రమము నిర్మితమైంది. ఆశ్రమానికి వచ్చిన వారందరినీ మూడునాలుగేళ్ళపాటు తన ఒడిలో సేదతీర్చారు ధ్యానం నాన్న. ఆ తరువాత డీప్ చింతనలో ధ్యానంలోకి వెళ్ళి 2018 మార్చి 14వ తేదీన అజ్ఞాతంలోకి వెళ్ళారు. మౌన అజ్ఞాత గాయిత్రి ఋషి అయిన ధ్యానం నాన్నకు సమాజం పట్ల తపన, ఆర్తి. అదే ఆధ్యాత్మిక బోధలకు దారి తీసింది. అజ్ఞాతానికి వెళ్ళక ముందు కూడా ధ్యానం నాన్న మౌనం పాటించేవారు. అందుకే ఆయన బోధలకు రాత, చిత్రాలు ఆధారం అయ్యాయి. ఋషి తండ్రి ఇంక్ పెన్ తో ఏకబిగిన పేజీలకు పేజీలు రాస్తారు. ఆ బోధలలో నిత్య జీవిత ఘటనలను మిళితం చేస్తారు. దాని వలన ఎవరైనా ఆ బోధలను తేలికగా అవగాహన చేసుకోగలరు.
Read Moreధ్యానం నాన్న చిత్రం అనుభూతుల సాక్షాత్కారం. ఆధ్యాత్మిక అనుభూతి, జీవిత అనుభవసారం ను కళ్ళకు కడతాయీ చిత్రాలు. ఏదో ఊహించి కాకుండా ఎప్పటి అనుభూతులు అప్పుడే చిత్ర రూపం ఇస్తారు ధ్యానం నాన్న. చిత్రాలు చిన్నప్పటి నుంచి ధ్యానం నాన్న జీవితంలో భాగం అయ్యాయి. పసి వయస్సులో మాటలు ఆలస్యంగా రావడంతో బొమ్మలే వ్యక్తీకరణకు ఆధారం చేసుకున్నారు. తరువాత ఆ బొమ్మలే ఆధ్యాత్మిక అనుసంధాన వ్యక్తీకరణకు ఆధారం అయ్యాయి. తర్వాత సమాజ జీవితానికి దర్పణం పట్టే సందేశాత్మక కార్టూన్లు వేసేవారు. గుహల్లో చిత్రాలు గీసిన సనాతన తపస్విలకు సృష్టి ఆధారాల ద్వారా అనుసంధానమై ఆ అనుభూతిలో ఆధ్యాత్మిక చిత్రాలు అందిస్తున్నారు. అందుకే ఆ ఆధ్యాత్మిక చిత్రాల లోతును గ్రహించడం కష్టమే. భవిష్యత్తులో ఆ చిత్రాలను డీ కోడ్ చేసే పరిజ్ఞానము వచ్చును. ఆ చిత్రాలతో ధ్యానం నాన్నకు, మనకు మధ్య సృష్టి ఆధారాల సంబందం ప్రత్యక్ష, పరోక్ష శాశ్వత దైవాల శక్తి అనుభవం, చైతన్య అనుభూతి ఉండును. పరోక్ష దైవాల శక్తి అనుభవం చైతన్య అనుభూతి ఈ సృష్టిలో అన్నిటిని అనుసంధానం చేస్తుంది. ఋషి తండ్రి నిత్య గాయిత్రి చింతన అనుసంధానంలో శంబలనగరి చైతన్యం శాశ్వతంగా అనుసంధానం అవుతుంది . అందుకే ఋషి తండ్రి ఆధ్యాత్మిక బిడ్డలు ఆ తపస్వి చిత్రాలను ఫ్రేమ్ కట్టించి తమ ఇళ్లలో అది ఆధ్యాత్మిక సంపదగా తరతరాలకు వెళ్ళే విధంగా చూసుకుంటారు. తపస్విలను స్వీకరించి, అనుసరించి, విశ్వసించి, జీవించడమే భారతీయ సనాతన హైందవ ఆధ్యాత్మికం.